Saturday, May 5, 2012

ముగ్గు 2

11 చుక్కలు పెట్టి
అటు ఇటు 9  చుక్కలు రెండు వరసలు పెట్టి
అదే విధంగా 5 చుక్కలు పెట్టి
1 చుక్క పెట్టాలి

ముగ్గు 1


10-2 సరి చుక్కలు

Sunday, February 12, 2012

ముగ్గు... జీవితంలో ఒక ప్రేత్యేక అనుబంధం

ఇంద్రధనసుని వాకిలి ముందు పరిచేది ముగ్గు
దేవతలకు ఇలలోకి, ఇంటిలోనికి ఆహ్వానం ముగ్గు

ఎటు వైపు చూస్తే అదే మొదలు అనిపిస్తూ
జీవితాన ఈ క్షణమే మొదలు అని సూక్తి ముగ్గు

పూవులు, పక్షులు, చేపలు, పిల్లలు, గాలి పఠాలు,
చివరికి హరిదాసులైననేమి అంతా తనవే
అని చాటే వసుదైక కుటుంబానికి సందేశం ముగ్గు

మెలికెల ముగ్గు జీవిత పయనానికి గుర్తు
ఎన్ని మలుపులు తిరిగిన గమ్యం తధ్యం అనే చిహ్నం

వరి పిండి, ధాన్యపు రాశులు, పూవుల రేకులు
ప్రకృతి ఇచ్చే రంగులు ప్రకృతి సిద్ధమైన జీవితానికి
ప్రకృతి కూడా చేయును సహాయమని చెప్పే సూచనలు
ముగ్గుపై పసుపు కుంకుమలు ధరణి సిగ్గులకి తొలి అలంకరణ

ముగ్గు సాంప్రదాయం మనకు ఈనాటిది కాదు సుమా
రామునికి సీత చెప్పిన స్వాగతంలో అందం పెంచెను ముగ్గు
పెరుమాళ్ కి ఆండల్ తెలిపిన భక్తికి సహాయం ముగ్గు
జీవితాన్నిచీకటిగా ఉంచుకోకు అని చెప్పే స్నేహిత ముగ్గు


Shloka( శ్లోకా శాస్త్రి)